• Questions? +91 94938 62531

Back2School Programme at MP Primary Govt. School at Gondla Ramavaram village, Bhadradri -Kothagudem District

Event Title Event Date

Back2School Programme at MP Primary Govt. School at Gondla Ramavaram village, Bhadradri -Kothagudem District

2017-06-24

Event Description

"MISSION 1000 Smiles" ~~ KRISHI NGO organized "Back2School" Programme and distributed School kits to Primary students of MPP School, Gondla Ramavaram Village, Laxmidevipally Mandal, Bhadradri-Kothagudem District. on 24-Jun-2017

* కృషి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా స్కూల్ కిట్స్ పంపిణీ * * కృషి రూరల్ డెవెలప్ మెంట్ సొసైటి, వరంగల్ వారి ఆధ్వర్యంలో MPP School, గొండ్ల రామవరం, లక్ష్మిదేవిపల్లి మండలం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో "బ్యాక్ టూ స్కూల్" అనే ప్రోగ్రామ్ నిర్వహించి - బడి పిల్లలందరికి ఉచితంగానే స్కూల్ బాగ్స్, నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు మరియు ఇతర స్టేషనరీ సామగ్రి అందించడం జరిగింది.

కృషి NGO సంస్థ 2005 సంవత్సరంలో స్థాపించబడి, గత 12 సం!!లుగా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్ధికంగా మరియు సామాజికంగా వెనుకబడిన కొన్ని గ్రామలని ఎంచుకొని గ్రామీణాభివృద్ధియే లక్ష్యంగా, స్వలాభాపేక్ష లేకుండా, సేవా నిరతితో పలు కార్యక్రమాలు చేస్తున్నారని ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీ. ప్రదీప్ మంద గారు చెప్పడం జరిగింది. * మిత్రులు అందించిన సహాయ సహకారాలకు, కృషి వరులందరికి మేము-మీరు అందరు కృతజ్ఞతలు తెలియచేయలని నివేదించారు*

గ్రామీణ నేపధ్యంలో పుట్టి పెరిగి, కృషి -పట్టుదలతో తాము సాధించిన ప్రగతిని, గ్రామాల్లో పుట్టి పెరిగే నిరుపేదలకు సహాయం చేసి వారిని అభివృద్ధి పట్ల చైతన్యం చేయడానికి, ఇటువంటి లాభాపేక్ష లేకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. // "సీ టు రీడ్" అంటే "చదువు కోసం చూపు" అనే నినాదంతో ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉన్నటువంటి విద్యార్థులందరికి కళ్ళ జోళ్ళను కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పలు స్కూల్లలో నిర్వహిస్తున్నారు. // "ఐడియల్ గురు" అంటే "ఆదర్శ ఉపాద్యాయులు" అనే ప్రోగ్రాంలో భాగంగా గ్రామాల్లో అంకితభావం మరియు సేవనిరతితో పనిచేసే ఉత్తమ ఉపాద్యాయులను గుర్తించి వారికి అవార్డ్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

షెడ్యూల్డ్ తెగలు నివసించే గ్రామాన్ని చదువుతో సామాజిక చైతన్యం తీసుకురావాలని ఉద్దేశ్యంతో కృషి తన వంతు తోడ్పాటు అందిస్తుందని, అందుకు గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకుని క్రియాశీలకంగా పాలు పంచుకోవాలని - కృషి వ్యవస్థాపక సభ్యులు మురహరి పొనుగోటి ఒక సందేశాన్ని పంపడం జరిగింది. // ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి భారతి, మండల పరిషత్తు సభ్యులు శ్రీ రమేష్, ప్రధాన ఉపాద్యాయులు శ్రీమతి రాజకుమారి, పేరెంట్స్ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు కృషి సంస్థను అభినందిస్తూ తమ గ్రామానికి పలు కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకున్నారు. 

Krishi Integrated Rural Development Society

https://www.facebook.com/murahari.ponugoti/posts/1577571542261186